బీజింగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. చైనా పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఆ దేశ రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. చైనా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ, చైనాలోని రష్యా రాయబార కార్యాలయం అధికారులు.. పుతిన్‌కు స్వాగతం పలికారు.
చైనా- రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా ఈ రెండు దేశాలు మిత్రత్వాన్ని కొనసాగిస్తూ వస్తోన్నాయి. పుతిన్‌కు చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ను ఆప్తమిత్రుడిగా అభివర్ణిస్తుంటారు. ఆర్థిక కార్యకలాపాలు, ఆయుధాల కొనుగోళ్లు, మిలటరీ ఆపరేషన్స్, ఎగ్జిమ్.. వంటి రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి.
సుదీర్ఘ విరామం అనంతరం పుతిన్.. చైనా పర్యటనకు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన సమయంలో చాలా సందర్భాల్లో పుతిన్.. గ్ఝి జిన్‌పింగ్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ ఏడాదిన్నర కాలంలో 40 సార్లు వారిద్దరు సంభాషించుకున్నట్లు చైనా మీడియా తెలిపింది. ఇక పుతిన్ నేరుగా చైనాలో అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
#WATCH | Russian President Vladimir Putin arrives at Beijing airport, in China.
(Source: Reuters) pic.twitter.com/759g3LC9L8
— ANI (@ANI) October 17, 2023