చిత్తూర్ జిల్లా, చౌడేపల్లి : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో లీలా మాధవి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనంలో కొంతమేర నాణ్యత లోపించిందని పరిస్థితి ఇలాగే కొనసాగితే వేటు తప్పదని హెచ్చరించారు. వండిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగరాజు రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
