చిత్తూరుజిల్లా, చౌడేపల్లి : రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల చెరువులా మారింది. చౌడేపల్లిచెరువు నిండి పొర్లుతున్న నీరు వెళ్లే రాజుకాలవలు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించడం వలన వర్షపునీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయి వర్షపు నీళ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనికి చేరడంవలన కళాశాల మొత్తం నీటితో నిండి చెరువులా మారిపోయింది కళాశాలకు చేరుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కళాశాలకు నలువైపులా మట్టి తోలి డ్రైనేజి సౌకర్యం లేకున్నా అక్రమ కట్టడాలు నిర్మించిన సంబంధిత అధికారుల్లో ఎటువంటి స్పందన లేదు. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడం వలన వర్షాల కారణంగా నీరు ఇళ్ళు, రోడ్లపై చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కళాశాలలో నీరు చేరడంవలన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని కళాశాల ప్రిన్సిపాల్, మరియు విద్యార్థులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు గురి ఐన రాజుకాలువను గుర్తించి అక్రమ కట్టడాలను తొలగించి కళాశాల విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది లేకున్నా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.