కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం తహసిల్దార్ కి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అనేక భూ సమస్యలు పేరుకుపోయాయని రైతులు ఎవరికి చెప్పాలో తెలియక అయోమయనికి గురవుతున్నారని అన్నారు . ధరణిలో పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు తీసుకురావాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు . సాదా బాయినమపై కొనుగోలు చేసిన భూములను వెంటనే పరిష్కరించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి సహాయ కార్యదర్శి చోక్కల శ్రీశైలం,మండల కోశాధికారి గర్శకుర్తి శ్రీనివాస్,యువజన నాయకులు మొలుగురి ఆంజనేయులు,మండల నాయకులు బోయిని మల్లయ్య,కూన మల్లయ్య, కొమురయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
