సిద్దిపేట జిల్లా: ది రిపోర్ట్ టీవీ : సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బెజ్జంకి మండల సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ పాత్రికేయుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని విద్యాశాఖ లో విలీనం చేయాలని గత 13రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరించాలనిసమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిని పట్టించుకోవడంలేదని అందుకే శాంతియుతగ చేస్తున్న వారి సమ్మెకు మద్దతు తెలుపుతున్నాం అనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అదే విధంగా ప్రభుత్వం విద్యను అభివృద్ధి చేయాలని అన్నారు.