కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మార్వో వి. అనంతరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన వారినీ గుర్తించి ఇండ్లను మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం ఇస్తున్న మూడు లక్షలు సరిపోవని 5 లక్షలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు ఎస్టి ఎస్సీ బీసీ రుణాలు మంజూరు కాలేదు ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి మంజూరు చేయవలసిందిగా కోరారు, అకాల వర్షంతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని వెంటనే సర్వే జరిపించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని మరియు గ్రామాల్లో పూర్తిస్థాయిలో రేషన్ డీలర్లను నియమించాలని రేషన్ కార్డు లో పేరు నమోదు చేసుకునే వారికి ఆప్షన్స్ ఇవ్వాలి రేషన్ కార్డులో పేరు నమోదు చేయాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, కోశాధికారి దర్శకుర్తి శ్రీనివాస్, నాయకులు బోయిని మల్లయ్య,పబ్బాతి సాగర్ రెడ్డి, రామంచ మల్లేశం, కూన మల్లయ్య, కూన పవన్,బట్టు పోచయ్య తదితరులు పాల్గొన్నారు.