విభజన చట్టం లో కేటాయించిన వెనకబడిన ప్రాంతాలకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయకుండా ద్రోహం చేసిన వారు ఆంధ్ర ప్రదేశ్ పర్యటన చేస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు వినూత్నంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా బుందేల్ ఖండ్ తరహాలో నిధులు కేటాయించి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము అనంతపురం జిల్లాకు విశ్వవిద్యాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము కర్నూల్ నగరం లో 400 కోట్లతో హైకోర్టు, పరిశ్రమలు నిర్మిస్తాం వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటాము వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని అనేక హామీలుఇచ్చి ఎన్డీఏ కూటమి శ్రేణి ఎంపీల సహకారంతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిధులు కేటాయించడం లేదు. తక్షణమే వెనుకబడిన రాష్ట్రాలకు జిల్లాలకు కేటాయించిన నిధులు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రామకృష్ణ మల్లికార్జున మల్లేష్ కవిత శ్యామల తదితరులు పాల్గొన్నారు