contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కార్పొరేషన్ల ఏర్పాటుపై హర్షం .. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన దాసు సురేశ్..

ఆదివాసి దళిత బీసీ, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ శనివారం వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ..

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తమ కార్యవర్గసభ్యులతో కలిసి గడిచిన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు పాలక మండళ్ళను నియమించకుండా బీసీలు, అణగారినవర్గాల నాయకత్వాన్ని అణగదొక్కిన విషయాన్ని తెలియజేసిన వెంటనే తమ విజ్ఞప్తులకు స్పందించి కార్పొరేషన్లను ప్రకటించడం సబ్బండ వర్గాల అభ్యున్నతిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని, నిబద్ధతను తెలియజేస్తుందన్నారు..

ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కులగలనను, బీసీ మైనార్టీ దళిత గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ గురుకులాలకు సమీకృత శాశ్వత భవనాలకు మంత్రివర్గ ఆమోదంతెలపడంతోబాటు నిధులను విడుదల చేయడం వాటిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం, టెట్ ను ప్రకటించడం లాంటి విషయాలన్నీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే సాధ్యమవుతున్నాయని దాసు సురేశ్ కితాబిచ్చారు..

బీసీలు దళితులు గిరిజనులు అణగారిన వర్గాల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రజాపాలనలో వారికి సముచిత ప్రాధాన్యతను ఇస్తూనే ఈ వర్గాల అవకాశాలను ఇనుమడింపజేసేలా సహకరించాలని కోరారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రజాపాలనలో పెద్ద ఎత్తున బిసి దళిత మైనార్టీ గిరిజనులకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు దాసు సురేష్ తెలిపారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :