- గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్
కరీంనగర్ జిల్లా: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలను ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రాజీవ్ రహదారిపై గత మూడు రోజులగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను గుర్తించి అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికల్ని చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వ అధికారులు సైతం ఇది ఎప్పుడు జరిగే తంతుకదా అని మాట్లాడుతున్నారని అన్నారు, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో పంటలు నష్టపోయి రైతులు అరిగోస పడుతుంటే ప్లీనరీల పేరుతో బిఆర్ఎస్ నాయకులు డాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారని, జిల్లాలో 300కు పైగా కొనుగోలు కేంద్రాలు ఉంటే కేవలం 150 కేంద్రాల్లో కొబ్బరికాయలు కొట్టి ఊరుకున్నారే కానీ పది కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రారంభించలేదని దీనిపై జిల్లా అదనపు కలెక్టర్ వివరణ కోరగా ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతుకదా అని తేలికగా మాట్లాడారని రైతుల కన్నీళ్లు చులకనగా కనిపిస్తున్నాయని, అదికార పార్టీకి తొత్తులుగా మారి రైతుల కష్టాన్ని విస్మరిస్తున్నారని మండి పడ్డారు, రైతులను చిన్నచూపు చూస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వంపై త్వరలో రైతులు, ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.. గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వడగళ్ల వానలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం అందిస్తానీ ప్రకటించినప్పటికిని రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షాన నిలబడుతుందని రైతులు అధైర్యపడవద్దని జిల్లాధ్యక్షుడు భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, తిప్పర్తి పరిపూర్ణ చారి, చింతల శ్రీధర్ రెడ్డి, మాతంగి అనిల్, గంప మహేష్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.