contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బాబోయ్.. 2000వేల కోట్ల .. డ్రగ్ రాకెట్ కేసులో ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్

  • 2000 కోట్ల డ్రగ్ రాకెట్‎లో తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్‎ను ఢిల్లీ నార్కోటిక్ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • నార్కోటిక్ పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
  • జాఫర్ సాదిక్ కేంద్రంగా మూడు సంవత్సరాల నుండి భారీ డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్టు గుర్తించారు.
  • మూడు సంవత్సరాల్లో సుమారు 3000 కేజీలకు పైగా డ్రగ్స్‎ను ఇతర దేశాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో బయటపడింది.

 

రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ)తో కలిసి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ. 2,000 కోట్ల డ్రగ్స్ దోపిడీతో సంబంధం ఉన్న తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ (ఎన్‌సిబి) శనివారం అరెస్టు చేసింది. సాదిక్‌ డ్రగ్స్‌ సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడని, గత మూడేళ్లుగా వివిధ దేశాలకు 45 సరుకులను పంపాడని, ఇందులో దాదాపు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌ ఉన్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.

డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో భారీ పెట్టుబడులు మొత్తం 45 కన్సైన్మెంట్‎ల ద్వారా గడిచిన మూడు సంవత్సరాల్లో వివిధ దేశాలకు సూడో ఎపిడ్రిన్ అనే డ్రగ్‎ను ఎగుమతి చేసినట్టుగా గుర్తించారు. డ్రగ్ రాకెట్‎లో వచ్చిన డబ్బులను సినిమా ఇండస్ట్రీతో పాటు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టాడు. డ్రగ్ రాకెట్ ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు నార్కోటిక్ అధికారుల ముందు సాధిక్ ఒప్పుకున్నాడు. కొద్దిరోజుల ముందు డ్రగ్స్‎ను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న కెమికల్స్‎ను ముగ్గురు వ్యక్తుల నుండి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో‎తో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫిక్ నెట్వర్క్‎ను ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ కోసం గత రెండు వారాలుగా ఢిల్లీ బృందాలు వెతుకుతున్నాయి. ఈ ముగ్గురి నుండి 50 కేజీల సుడో ఎపిడ్రిన్ డ్రగ్‎ను పోలీసులు సీజ్ చేశారు.

సముద్రం, కార్గో ద్వారా డ్రగ్స్ సరఫరా

వీరి నుండి పట్టుబడ్డ మత్తు పదార్థాలను ఇతర దేశాలకు తరలించేందుకు రెండు మార్గాలను ఎంచుకున్నట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. సముద్రంతో పాటు వాయు మార్గాలను వీరు ఎంచుకున్నారు. కార్గో పార్సెల్ ద్వారా ఇతర దేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. హెల్త్ ప్రోడక్ట్స్ పేరుతో పార్సెల్ పంపించి అందులో ఉన్న పదార్థాలతో డ్రగ్స్ పౌడర్‎ను మిక్స్ చేసి పంపుతున్నారు.

ఇతర దేశాల అధికారులకు సమాచారం

న్యూజిలాండ్‎తో పాటు ఆస్ట్రేలియా పోలీసులు ఆ దేశాల్లో డ్రగ్స్ పట్టుబడుతుండడంతో వాటి మూలాలను కనుగొన్నారు. అక్కడ కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భారత్‎లో మూలాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ డ్రగ్ ముఠాతో సంబంధాలు కలిగిన తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఇతర దేశాలకు సూడో ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థాన్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నాడు. ఇతర దేశాలకు వీటిని తీసుకెల్లాక అక్కడ దర్యాప్తు సంస్థలు వీటి మూలాలను గుర్తించి భారత్‎కు సమాచారం చేరవేశారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‎పై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నరు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :