contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్‌.. పోలింగ్ పూర్తి వివ‌రాలు

ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ‌వారం ప్రెస్ మీట్‌ నిర్వహించి పోలింగ్‌ వివరాలను వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంట‌లు దాటాక కూడా పోలింగ్ కొన‌సాగింద‌ని చెప్పారు. ఆఖ‌రి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంట‌ల‌కు పోలింగ్ ముగిసిన‌ట్లు తెలిపారు.

మొత్తంగా 81.86 పోలింగ్ న‌మోదైన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్ట‌ల్ బ్యాలెట్‌తో 1.2 శాతం న‌మోద‌యిన‌ట్లు తెలిపారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగింద‌న్నారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం న‌మోదైంద‌ని చెప్పారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో 90.91 శాతం పోలింగ్ న‌మోదైతే, అత్య‌ల్పంగా తిరుప‌తిలో 63.32 శాతం న‌మోద‌యిన‌ట్లు తెలిపారు.

అదే లోక్‌స‌భ స్థానాల్లో అత్య‌ధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్య‌ల్పంగా విశాఖ‌లో 71.11 శాతం పోలింగ్ న‌మోద‌యిన‌ట్లు సీఈఓ వివ‌రించారు. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. 4.14 కోట్ల మంది ఓట‌ర్లు ఉండ‌గా, ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర‌వ్యాప్తంగా 46, 389 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింద‌న్నారు. అలాగే పోలింగ్ కోసం లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగించినట్లు పేర్కొన్నారు.

పలు చోట్లు హింసాత్మక ఘటనలు నెలకొన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఆయా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు తప్పా, ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. రీపోలింగ్ ఫిర్యాదులేవీ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈవీఎంల‌న్నిటినీ 350 స్ట్రాంగ్ రూముల్లో భ‌ద్ర‌ప‌రిచామ‌న్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్దందికి ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలియ‌జేశారు. జూన్ 4వ‌ తేదీన ఫలితాలు వెలువడుతాయని సీఈవో మీనా తెలిపారు.

జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా..
అల్లూరి సీతారామరాజు – 72..20 శాతం
అనకాపల్లి – 83.84 శాతం
అనంతపురం – 81.08 శాతం
అన్నమయ్య – 77.83 శాతం
బాపట్ల – 85.15 శాతం
చిత్తూరు – 87.09 శాతం
అంబేద్కర్ కోనసీమ – 83.84 శాతం
తూర్పు గోదావరి – 80.93 శాతం
ఏలూరు – 83.67 శాతం
గుంటూరు – 78.81 శాతం
కాకినాడ – 80.31 శాతం
కృష్ణా – 84.05 శాతం
కర్నూలు – 76.42 శాతం
నంద్యాల – 82.09 శాతం
ఎన్టీఆర్ – 79.36 శాతం
పల్నాడు -85.65 శాతం
పార్వతీపురం మన్యం – 77.10 శాతం
ప్రకాశం – 87.09 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు – 79.63 శాతం
శ్రీ సత్యసాయి – 84.63 శాతం
శ్రీకాకుళం – 75.59 శాతం
తిరుపతి – 78.63 శాతం
విశాఖపట్నం – 70.03 శాతం
విజ‌య‌న‌గ‌రం – 81.33
పశ్చిమ గోదావరి -82.59 శాతం
వైఎస్సార్ – 79.58 శాతం

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :