పార్వతీపురం మన్యం జిల్లాలో జనవాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. కొమరాడ మండలం ఆర్తాం వద్ద ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. పలు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఓ బస్సుపైనా దాడి చేసింది. తొండంతో అద్దాలు పగులగొట్టిన ఆ ఏనుగు… అంత పెద్ద బస్సును సైతం అవలీలగా వెనక్కి నెట్టేసింది. దాంతో అందరూ హడలిపోయారు. స్థానికులు కర్రలు తీసుకుని, పెద్దగా కేకలు వేస్తూ ఏనుగును తరిమివేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో దర్శనమిస్తోంది.