సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేసిన తెలుగు నేలకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నం నాగేశ్వరరావు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతటితో ఆగని ఆయన మరో మాట అంటూ ఇంకో కీలక అంశాన్ని ప్రస్తావించారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది అని ఆయన జగన్‌పై సెటైర్ సంధించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం.🙏
మరో మాట:
తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది.— M. Nageswara Rao IPS(Retired) (@MNageswarRaoIPS) May 25, 2022