గుంటూరు – మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆడిటోరియంలో ఈరోజు “రోగులు వారి భద్రత ప్రాధాన్యం” అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. ఈ సెమినార్‌లో ప్రముఖ వైద్యులు, కేంద్రం నుంచి పలువురు అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరై, వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితులు, వైద్యుల బాధ్యతలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా ప్రతి సంవత్సరం 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు.
డాక్టర్లు, వైద్యులు ప్రిస్క్రిప్షన్లు రాసేటప్పుడు అర్థం కాకుండా ఉండడం, షిఫ్ట్ మారినప్పుడు సరైన సమాచార మార్పిడి జరగకపోవడం వంటి అంశాలు ప్రమాదకరంగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యాంటీబయాటిక్స్ వినియోగం ఈ నేపథ్యంలో ఒక పెద్ద సమస్యగా మారింది. మెడికల్ షాపుల్లో ఇవి అధికంగా అమ్మబడుతున్నాయని, అనవసరంగా ఈ మందుల వినియోగం రోగులకు దుష్ప్రభావాలు కలిగించవచ్చని డాక్టర్లు చైతన్యం కలిగించారు.
భారతదేశం లో మరణాల సంఖ్య పెరిగిన దేశాల కంటే ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో యువ వైద్యుల బాధ్యత కీలకమని డా. చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ సెమినార్‌లో భారతదేశం నలుమూలల నుంచి వైద్యులు హాజరై, రోగుల భద్రత కోసం తాము పెద్దపేట వేయాలని ఓత్ తీసుకున్నారు.