contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలు .. భారత్ స్థానంలో ఎంతో తెలుసా ?

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా 2023 కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ (సీపీఐ)ను విడుదల చేసింది. సీపీఐ గ్లోబల్ సగటు వరుసగా 12వ ఏడాది కూడా 43 వద్ద ఎలాంటి మార్పు కనిపించలేదు. రెండింట మూడొంతుల దేశాలు 50 లోపే స్కోర్ చేశాయి. ప్రభుత్వ రంగంలో చోటుచేసుకున్న అవినీతి ఆధారంగా మొత్తం 180 దేశాలు, భూభాగాల్లో అధ్యయనం చేసిన సీపీఐ అవినీతి స్థాయిని సున్నా (అత్యంత అవినీతి) నుంచి 100 (అస్సలు అవినీతి లేనిది) స్కోరు ఇచ్చింది.

అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలు
ఈ జాబితాలో డెన్మార్క్‌ వరుసగా ఆరో ఏడాది కూడా టాప్ ప్లేస్‌లో నిలిచింది. సీపీఐ ఇండెక్స్‌లో దానికి 90 స్కోరు లభించింది. ఆ దేశంలో అద్భుతమైన న్యాయవ్యవస్థ ఉందని నివేదిక కొనియాడింది. ఫిన్లాండ్ (87), న్యూజిలాండ్ (85) స్కోర్లతో వరుసగా రెండుమూడు స్థానాల్లో నిలిచాయి. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో నార్వే (84), సింగపూర్ (83), స్వీడన్ (82), స్విట్జర్లాండ్ (82), నెదర్లాండ్స్ (79), జర్మనీ (78), లగ్జంబర్గ్ (78) చోటు సంపాదించుకున్నాయి.

అత్యంత అవినీతి దేశాలు
అత్యంత అవినీతి కలిగిన దేశాల జాబితాలో సోమాలియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ దేశం 11 స్కోరుతో అగ్రస్థానం చేరుకోగా, ఆ తర్వాత వరుసగా వెనిజులా (13), సిరియా (13), సౌత్ సూడాన్ (13), యెమెన్ (16) నిలిచాయి. ఈ దేశాలన్నీ దీర్ఘకాలంగా సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతుండడం, సాయుధ పోరాటాలతో నిత్యం అల్లకల్లోలంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక పేర్కొంది. 172వ ర్యాంకుతో ఉత్తర కొరియా అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా నిలిచింది.

ఇండియా స్కోరు 39
సీపీఐ ఇండెక్స్ 2023 నివేదికలో భారతదేశం 39 స్కోరుతో 93వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదని నివేదిక తెలిపింది. 2022లో ఇండియా ఓవరాల్ స్కోర్ 40 కాగా, 93వ ర్యాంకులో ఉంది. పాకిస్థాన్ 29, శ్రీలంక 34 ర్యాంకులతో ఉన్నాయి. ప్రపంచబ్యాంక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ప్రైవేట్ రిస్క్, కన్సెల్టింగ్ కంపెనీలు, థింక్ ట్యాంకులు సహా మరో 13 ఇతర వనరుల నుంచి డేటాను సేకరించి ట్రాన్స్‌పరెన్స్ ఇంటర్నేషనల్ ఈ నివేదికను విడుదల చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :