contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గవర్నర్ తమిళసై అసెంబ్లీ లో ప్రసంగం .. కేసీఆర్ ను ఏకిపారేసిన గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈనాటి సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. మరోవైపు కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

గవర్నర్ స్పీచ్ హైలైట్స్:

  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోంది.
  • ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చింది.
  • ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.
  • ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నాం.
  • అన్ని గ్యారెంటీలను నిర్ణీత సమయంలో అమలు చేస్తాం.
  • త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెస్తాం.
  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తాం.
  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం.
  • అర్హులకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.
  • ప్రజాభవన్ ను ప్రజల కోసమే వినియోగిస్తున్నాం.
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాం.
  • చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకుంటాం. ఎంఎస్ఎంఈకి కొత్త
  • పాలసీ తీసుకొస్తాం.
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
  • దేశ ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం.
  • టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం.
  • గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తాం. కార్బర్ ఉద్గారాలను తగ్గిస్తాం.
    ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం.
  • రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం.
  • రాష్ట్రానికి కొత్తగా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తాం.
  • గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :