తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పదవులను భర్తీ చేస్తున్నారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ లుగా నియమించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి ఎమ్మెల్యే), ఆది శ్రీనివాస్ (వేములవాడ ఎమ్మెల్యే), బీర్ల ఐలయ్య (ఆలేరు ఎమ్మెల్యే), రామచంద్రు నాయక్ (డోర్నకల్ ఎమ్మెల్యే)లు ప్రభుత్వ విప్ లుగా నియమితులయ్యారు. చీఫ్ విప్ లుగా వేముల వీరేశం, మల్ రెడ్డి రంగారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.