సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా వారిని గజమాలతో సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ కవ్వం పెల్లి సత్యనారాయణ తన డాక్టర్ వృత్తి ద్వారా అనేకమంది పేద ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తూ పేద ప్రజలకు నిజమైన ప్రాణదాతగా నిలుస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానగొండ శ్రవణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ ధోనె వెంకటేశ్వరరావు గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనాల ఐలయ్య, నియోజకవర్గ మాజీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వెన్నం రాజు,ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు చందు, బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులు శరత్, శీలం నర్సయ్య, పిట్టల అరుణ్, గుండ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
