contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమెరికా వెళ్లే వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు .. ఫిబ్రవరి నుండి దరఖాస్తుల ఆన్ లైన్ ఫైలింగ్

ఉద్యోగం/అమెరికా : వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయించే హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక సమాచారంతో కూడిన ప్రకటన విడుదల చేసింది. అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్ సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.

అమెరికా ప్రకటన వివరాలు…

  • హెచ్1బీ వీసా దరఖాస్తుల కోసం ఆన్ లైన్ ఫైలింగ్ ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభం
  • హెచ్1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్ ల కోసం కొత్తగా సంస్థాగత ఖాతాలు (ఆర్గనైజేషనల్ అకౌంట్స్) అందుబాటులోకి తీసుకువచ్చిన యూఎస్ సీఐఎన్
  • చట్టపరమైన సంస్థలు, ప్రతినిధుల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన ఫీచర్ లకు రూపకల్పన
  • హెచ్1బీ దరఖాస్తుదారులు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారం ఐ-129, అనుబంధ ఫారం ఐ-907కు సంబంధించిన ప్రీమిండియా ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్ లైన్ లో ఫైలింగ్ చేసే సదుపాయం
  • హెచ్1బీ వీసా దరఖాస్తు ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులు ఇన్ఫో సెషన్లకు హాజరయ్యేలా యూఎస్ సీఐఎన్ ప్రోత్సాహం
  • హెచ్1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో ఆన్ లైన్ ఫైలింగ్ వివరాలు, సంస్థాగత ఖాతాల వివరాలు అందుబాటులోకి తెస్తున్న యూఎస్ సీఐఎన్
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :