37వ బాయ్స్ సబ్ జూనియర్ తెలంగాణ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సి ఓ ఈ విద్యార్థి డి. ఇశాంత్ రన్నర్ గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ నెల 10 నుండి 12 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో స్టేట్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోరాహోరీగా జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు అత్యంత ప్రతిభ చూపి రన్నర్ గా నిలిచింది.ఈ జట్టులో అత్యంత కీలకంగా ఆడి జట్టు విజయానికి తోడ్పడిన డి. ఇషాంత్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గొనె శ్యామ్ సుందర్ రావు , కనపర్తి రమేష్ లు ప్రత్యేకంగా అభినందించి ట్రోఫీ అందజేసినట్లు సి ఓ ఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఇషాంత్ ను ప్రిన్సిపల్ ఐనాల సైదులు, పిడి అల్లూరి వామన్, పిఈటి ఎన్ రాకేష్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొన్నం శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ కే రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
