సిద్దిపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ విద్యార్థి విభాగం నాయకుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాల కాలంలోనే వంద సంవత్సరాల అభివృద్ధిని చేసి ప్రజల ముందు ఉంచిన ప్రభుత్వం మన తెలంగాణ బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని ఒకప్పుడు ఒక మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల మంజూరు కావాలంటే ముఖ్యమంత్రి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగిన మంజూరు కాకుంటే పరిస్థితి ఇప్పుడు మన సిద్దిపేటలో అనేక విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం, అభివృద్ధి అంటే సిద్దిపేట అనే విధంగా వేరే ప్రాంతం వాళ్లు ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దు కున్నాం ఒక విద్యావ్యవస్థనే కాకుండా అన్ని రంగాలలో సంపూర్ణ ప్రగతిని సాధించాం. ఈ అభివృద్ధిని ప్రతి పల్లె పల్లెకు తెలియజేసే బాధ్యత చదువుకున్న వారిగా విద్యార్థి విభాగం పైన ఉంది అని సూచించారు. ఇందుకోసం ప్రతి పల్లెలో విద్యార్థి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని సూచించారు. రానున్న దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడానికి మీ వంతు కృషి చేయాలని విద్యార్థి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, మచ్చు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ వి మెరుగు మహేష్, చిన్నకోడూర్ సెల్ పాయింట్ ప్రవీణ్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు శ్యామ్ యాదవ్,కన్వీనర్ రామ్మోహన్, పట్టణ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు మహిపాల్ గౌడ్, అన్ని మండలాల టిఆర్ఎస్వి అధ్యక్షులు, కన్వీనర్లు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మంత్రి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
