అల్లూరి జిల్లా, హుకుంపేట : హుకుంపేట ప్రధాన రహదారి కి అనుకుని వున్నా నూతన జాతీయ రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని బీజేవైఎం అరకు పార్లమెంట్ నాయకులు ధ్వజమెత్తారు, శనివారం బీజేవైఎం నాయకులు జాతీయ రహదారి నీ పరిశీలించారు, అనంతరం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మినుముల గోపాల పాత్రుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాన్ని జాతీయ రహదారులతో అభివృద్ధి చెయ్యాలని కేంద్రం లో నరేంద్ర మోదీ నేతృత్వం లోని భారత ప్రభుత్వం అరకు నుంచి రాజమండ్రి మీదుగా భద్రచలం వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు,అధికారుల పర్యవేక్షణ లోపం గా సంబంధిత గుత్తేదారు హుకుంపేట కు అనుకున్న వున్నా జాతీయ రహదారి నీ నాణ్యత లోపం గా నిర్మించారాని ఆరోపించారు, ఇటీవల కురిసిన చిన్న పాటి వర్షాలకే చాలా చోట్ల రోడ్డు బీటలు వారిందని తెలిపారు, క్వాలిటి కంట్రోల్ అధికారులు ఈ జాతీయ రహదారి నిర్మాణం ను ఒక్కసారి అయినా పరిశీలించారా అనీ ప్రశ్నించారు, జిల్లా కలెక్టర్ స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించని గుత్తేదారు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేని పక్షం లో జాతీయ రోడ్డు, భవన నిర్మాణ శాఖ మంత్రిత్వ శాఖకు పిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు, ఈ కార్యక్రమం లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గెమ్మెలి కొండ బాబు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లోరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
