గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో వాన దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మరో మూడు గంటల పాటు వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడి ట్రాఫిక్ జామ్‌లు తలెత్తాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్‌పల్లి, అబిడ్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.