హైదరాబాద్: హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం వద్ద బీసీ జన సభ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ బిసి 42 రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి ఒంటెద్దు పోకడతో విద్య ఉద్యోగ రాజకీయంగా చట్ట సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తే తప్ప చట్ట సవరణ చేస్తే తప్ప ఈ 42 శాతం అనేది బోకర్స్ అని ఈ రాష్ట్ర బీసీలు ఏకమై రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేం గద్దె దించుతామని బీసీ సభ బీసీ జన సభ బ్యాలెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.










