గుడిమల్కాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి అంకుర ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలోని రోగులు, సిబ్బందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆసుపత్రి ఆరు అంతస్తుల్లో ఉంది. ఆరు అంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయి. మొదట ఆరో అంతస్తులో మొదలైన మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి.