హైదరాబాద్ – ఎస్సార్ నగర్ : వెంగళరావు నగర్, సిద్ధర్థ్ నగర్ , మధురానగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై ట్రాఫీస్ పోలీస్ వారు కొరడా ఝులిపిం చారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు చొరవ చూపారు. కాలనీలో రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.
ఈ సందర్భంగా సిఐ సంజయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డ్రైవ్ లో ఎస్సై గణేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.