contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇల్లంతకుంటలో ఆరేపల్లి మోహన్ ప్రచారానికి ప్రజల బ్రహ్మరథం..

  • అడుగడుగునా జన నీరాజనం … ప్రచారానికి విశేష స్పందన..
  • బిఆర్ఎస్, కాంగ్రెస్ లు విశ్వాసఘాతక పార్టీలు..
  • నమ్మితే మోసం చేస్తారు… నేను కూడా బాధితున్నే…
  • రెండుసార్లు ఓడిపోయా.. ఈసారైనా గెలిపించండి…
  • నన్నుసాదుకుంటారో..సంపుకుంటారో మీ ఇష్టం…
  • ప్రజల ఆశయాలు, ఆకాంక్షల కనుగుణంగా పనిచేస్తా..
  • చివరిగా ఒక్కసారి బిజెపి అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం…
  • ప్రచారంలో ఆరెపల్లి మోహన్ వ్యాఖ్యలు…

 

కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోనీ పలు గ్రామాల్లో ఆరేపల్లి మోహన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారం నిర్వహించిన ఆయా ప్రాంతాల్లో ఆరేపల్లి మోహన్ ప్రచారానికి విశేష స్పందన లభించింది . ప్రజానికం అడుగడుగునా ఆరేపల్లి మోహన్ కు నీరాజనాలు పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లు విశ్వాస ఘాతక పార్టీలని, ఆ పార్టీలను నమ్మితే నట్టేట మునిగినట్టేనని, మోసం చేయడంలో ఆ పార్టీలు దిట్టలాంటివన్నరు. ప్రజల ఆశయాలు ఆకాంక్షల కోసం , మానకొండూరు అభివృద్ధి కోసం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీలో చేరితే నా మనోభావాలను ఏనాడూ గుర్తించలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరిన పట్టించుకోలేదన్నారు. మాజీ శాసనసభ్యునిగా కనీస గౌరవం ఇవ్వకుండా, అనేక విషయాల్లో నన్ను బిఆర్ఎస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అవమానించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికిని కోల్పోయి , అధికారం కోసం టిడిపి ముసుగు వేసుకుందన్నారు. ప్రజలను పట్టించుకోకుండా, రాజకీయాలే పరమావధిగా జీవించే ఆ రెండు పార్టీల అధర్మ తీరును ఎండగట్టడానికి,ధర్మం వైపు నడిచే బిజెపి పార్టీ మానకొండూరు నియోజకవర్గ అసెంబ్లీఅభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడం జరిగిందన్నారు. మానకొండూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఓడిపోయా, ఈసారైనా గెలిపించాలని రెండు చేతులు జోడించి వేడుకుంటునన్నారు. ప్రజా ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా, మానకొండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసే నన్ను సాదుకుంటారో సంపుకుంటారో ఇక్కడి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పదేళ్ల నుండి ఎమ్మెల్యేగా ఉన్నా రసమయి బాలకిషన్ కు నియోజకవర్గ అభివృద్ధి కంటే సొంత అభివృద్ధి ముఖ్యమైందన్నారు. నియోజకవర్గ వెనుకబాటుకు ప్రధాన కారణం బి ఆర్ ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే రసమయి అని విమర్శించారు. కాంగ్రెస్ టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న కవంపల్లి సత్యనారాయణ పచ్చి రాజకీయ అవకాశవాది అన్నారు . సత్యనారాయణకు కు ఉన్న ఏకైక ఆశయం ఎమ్మెల్యే పదవి, ఆయన ఆశయం ఆకాంక్ష ను నెరవేర్చుకోవాలన్న తపన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనపై లేకపోవడాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. ఉంటే తనకు తెలిసిన వైద్య వృత్తితో ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేసేవారని ఆయన విమర్శించారు. అందుకే బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలను, వారి అభ్యర్థులను, ఆ పార్టీల పథకాలు ఉచిత హామీలను నమ్మి మోసపోవద్దన్నారు. అందుకే ఒక్కసారి ఇక్కడ బిజెపికి అవకాశం ఇచ్చి, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్ది, మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్, అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి, జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్,గుంటి మహేష్, పున్ని సంపత్, వజ్జెపల్లి శ్రీకాంత్, తిప్పరాపు శ్రవణ్,రొండ్ల మధుసూదన్ రెడ్ది,కమల్ల ఎల్లన్న,మ్యాకల మల్లేశం,దేశెట్టి శ్రీనివాస్, సుదగోని నారాయణ, మామిడి శేఖర్, మామిడి హరీష్, సుదగోని శ్రీకాంత్ లు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :