ఇరాన్‌లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. తర్వాత తానూ కాల్చి చంపుకొన్నాడు. కోర్టు భవనంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో ఆ జడ్జీలు అసమ్మతివాదులకు సామూహిక ఉరిశిక్షలు విధించారన్న కక్షతోనే ఈ పని చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఆ ‘చొరబాటుదారుడు’ హ్యాండ్‌గన్ పట్టుకొని సెంట్రల్ టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్ సుప్రీంకోర్టులోకి ప్రవేశించాడు. సుప్రీంకోర్టు 39వ బ్రాంచ్ అఽధిపతి అయిన హొజ్జత్ అల్ ఇస్లాం అలీ రజిని (71), సుప్రీంకోర్టు 53వ బ్రాంచ్ అధిపతి హొజ్జత్ అల్ ఇస్లాం వల్ ముసల్మీన్ మహమ్మద్ మొఖిసెష్ (68)లను గురిపెట్టి కాల్పలు జరపగా వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు.
