- కలెక్టర్ వస్తున్నారని.. అమానుషం!
జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కు తన గోడు చెప్పుకుందామని వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యం పేటకు చెందిన రాజ గంగారం అనే దివ్యాంగుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఇతర సిబ్బంది బలవంతంగా వీల్ చైర్ తో సహా బయటకు లాక్కెళ్లారు. అయినప్పటికీ రాజగంగారం డోర్ ఎదురుగా పడుకుని నిరసన తెలిపాడు. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ సత్యప్రసాద్ రావడంతో విధుల్లో ఉన్న సిబ్బంది దివ్యాంగుడిని పక్కకు జరుపడంతో కలెక్టర్ లోపలికి వెళ్లారు. కాగా ఇదే వ్యక్తి పోయిన సోమవారం తనకు ఉన్న దారి సమస్య తీర్చాలని కలెక్టరేట్లో పడుకుని నిరసన వ్యక్తం చేశాడు.