పిడుగురాళ్ళ మండలం జాన పాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం కొమ్మెర శ్రీహరి వాహన ప్రమాదం లో తీవ్ర గాయాలపాలయ్యారు. శ్రీహరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న పిడిగురునాళ్ల జన సైనికులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేసి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కలిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ప్రధాన కార్యదర్శి అవుల రమేష్, అంబటి సాయి కుమార్, అనపర్తి నాగేశ్వరరావు, బేతంచెర్ల ప్రసాద్ సాంబశివరావు, వెంకటేష్, నరసింహారావు, గణేష్, పూర్ణ, బుజ్జి, తిరుమల రావు, యతి రాజుల ఏడుకొండలు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు
