contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జనసేనపార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మార్చి 14న విజయవంతంగా జరగాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు ముమ్మరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా, “ఛలో పిఠాపురం” అనే పోస్టర్లను జనసేన పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

పార్వతీపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో, పార్టీ నాయకులు చందక అనీల్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేతం జరిగింది. ఈ సమావేశంలో వారు, మార్చి 14 న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.

జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ కలిసి ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆహ్వానించారు.

అనంతరం, “ఛలో పిఠాపురం” పోస్టర్లను ఆవిష్కరించి, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, పార్వతీపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందక అనీల్, నెయ్యగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, భమిడిపాటి చైతన్య, రెడ్డి నాగరాజు, గునాన నరేష్, బంటు శిరీష్, చింతాడ ముఖేష్, అన్నాబత్తుల దుర్గ, నెయ్యిగాపుల సంతోష్, వహబ్, సంబాణ రమేష్, కోరాడ మౌళి, పోట్నూరు రేవంత్, గేదెల వంశీ, పతివాడ వంశీ, వీరపిండి గణేష్, సంబన కుర్మరావు, కునుకు రమేష్, బూర్లి కిరణ్, రెడ్డి కామేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :