భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయం లో భూ భారతి చట్టం 2025 పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ఈ నెల 14న ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతుందని తెలిపారు. తదుపరి ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో అమలు చేస్తారని, అక్కడ ఏమైనా సమస్యలు పరిస్కారం కాకపోతే చట్టంలో మార్పులు తెచ్చి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు.
రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రికార్డులో తప్పుడు సవరణ రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ ప్రక్రియ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి కూడా మ్యుటేషన్ సదా బైనామాల క్రమబద్ధీకరణ రివిజన్ అధికారాలు గ్రామ రెవెన్యూ రికార్డులు రికార్డులను పొందడం జరుగుతుందని రైతులకు ఎంతో మేలు చేస్తుందని గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు ముఖ్య నాయకులు నియోజకవర్గ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.