పల్నాడు జిల్లా / కారంపూడి: కారంపూడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మృతదేహంతో బాధిత కుటుంబం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే. కారంపూడి గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య పొలాన్ని వేరే వారు ఆక్రమించుకొని రాళ్లు పాతినట్టు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని మానసిక వత్తిడికి లోనై గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బారి ఎత్తున ఆందోళన చేపట్టారు.
రిపోర్టర్ టివి ప్రతినిధి కారంపూడి ఎమ్మార్వోని వివరణ కోరగా .. 702 నంబర్ గల అసైన్డ్ భూమి ముసలయ్యకి ఇవ్వగా అతను 702 కు బదులు 702 , 3 లో ఉన్న భూమిని సాగు చేసుకుంటున్నాడు. సర్వేర్లతో భూమి కొలతలవేయగా ఈ విషయం తెలిసింది. దీనిపై పూర్తి విచారణ చేయాలనుకున్నాము, ఈలోపు అతనికి ఆరోగ్య సమస్యల వల్ల నరసరావుపేట తీసుకు వెళ్తే , అక్కడ గుండెపోటుతో మరణించినట్టు తెలిసిందన్నారు.
ఈ విషయం పై పూర్తి విచారణ జరిపి బాధిత కుటుంబానికి తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









