contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పౌరుషానికి ప్రతీక కారంపూడి… పల్నాటి ఉత్సవాలు

  • రసవ్రత్తమైన పోరు కోడిపోరు
  • బ్రహ్మనాయుడు కోడిని చేతబూనిన మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి
  • నాయకురాలు నాగమ్మ శివంగిడేగను చేతబూనిన మండల వైసీపీ నాయకులు కొంగర.సుబ్రహ్మణ్యం
  • కోడిపోరులో పాల్గొన్న వైసీపీ నాయకులు చలమరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన. మల్లికార్జునరావు

 

పల్నాడు జిల్లా, కారంపూడి : పల్నాడు జిల్లా, కారంపూడి : పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అన్నారు. అలనాటి పల్నాటి చరిత్ర లో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారితో కలిసి వీర్ల దేవాలయ ఆవరణలో కోడిపందెములను నిర్వహించారు. మాచర్ల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లు ను ఎమ్మెల్యే పిఆర్కే చేతబూనారు, గురజాల రాజ్యాం తరపున నాయకురాలు నాగమ్మ పందెపు కోడి శివంగి డేగను, మండల వైసీపీ నాయకులు కొంగర సుబ్రహ్మణ్యం చేతబట్టుకొని సాంప్రదాయ ప్రకారం కోడిపందలను నిర్వహించారు. పందెంలో బ్రహ్మనాయుడు కోడి (చిట్టిమల్లు) రెండు సార్లు విజయం సాధించింది. మూడవ సారి ఎవరు గెలిస్తే వారు రాజ్యాం వదిలి వెళ్లాలని అలనాడు బ్రహ్మనాయుడు ని నాయకురాలు నాగమ్మ రెచ్చగొడుతుంది దింతో మూడవ సారి కోడిపందాలకు పల్నాటి బ్రహ్మనాయుడు సిద్ధం అవుతాడు. ఈ మేరకు నాయకురాలు నాగమ్మ కుట్రలు కుతంత్రాలతో, నాగమ్మ కోడి అయినా శివంగి డేగ విజయాన్ని సాధిస్తుంది. దింతో బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లినట్లు చరిత్ర చెపుతుంది. ఈ కోడిపంద్యాలు ఎంతో రసవ్రత్తంగా కొనసాగాయి. కోడిపందేల ఘట్టాన్ని తిలకించేందుకు వైయస్సార్సీపీ నాయకులు కే. చలమారెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన. మల్లికార్జునరావు, వీరాచారావాంతులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కోడిపందేలను పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యగారు నిర్వహించారు. ఈ సందర్బంగా మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ పల్నాటి చరిత్ర చిహ్నాలను కాపాడుకొని పల్నాటి చరిత్రను దేశం నలుమూలలకు విస్తరింపచేసే విధంగా కృషి చేయవలసిన బాధ్యత పల్నాడు ప్రాంత ప్రజల పై ఉందని అయన అన్నారు. సుమరు 900 సంవత్సరాలు గా పల్నాటి వీరాచారా ఉత్సవాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని అయన అన్నారు. వీరాచారావాంతులు వారి ఆచారాన్ని పోగొట్టుకోకుండా వీరాచారాపీఠం నిలబెట్టేందుకు సాంప్రదయబద్దంగా ఉత్సవాలు కొనసాగుతాయని అని అయన అన్నారు. వీర్ల దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాను అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా పల్నాటి కథను వీరాచారవంతులు గాధ రూపంలో తెలియజేసారు. మొదటిగా కారంపూడి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ముందుగా బస్ స్టాండ్ సెంటర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహఆవిష్కరణలో పాల్గొని అనంతరం వీర్ల దేవాలయం చేరుకొని దేవాలయంలో పూజలు నిర్వహించి కోడిపోరులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు వీరచార పీఠం నిర్వాహకులు బొగ్గవరపు విజయ్ కుమార్, ఎంపిపి మేకల శారదశ్రీనివాసరెడ్డి, సర్పంచ్ రామావత్ ప్రమీలబాయి తేజానాయక్, వైసీపీ నాయకులు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి, పాతూరి రామిరెడ్డి, కొమ్ము చంద్రశేఖర్, షేక్ అక్బర్, జడ్పీటీసీ షఫీ, వైస్ ఎంపిపి బొమ్మిన సావిత్రి అల్లయ్య, కోమెర పిచ్చయ్య, సొసైటీ చైర్మన్ కొమ్మిరెడ్డి నల్లా గురువారెడ్డి, మాజీ ఎంపిపి పంగుళూరి. వెంకటనరసయ్య, కోరే సత్యం, మైనారిటీ నాయకులు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :