- మిరియాల నుండి కారంపూడి బదిలీ
- ఆదేశాలు జారీ చేసిన జిల్లా అధికారులు
కారంపూడి మేజర్ పంచాయతీ కార్యదర్శిగా కే. కాసిన్యనాయక్ ను నియమిస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసారు. కాసిన్యనాయక్ కారంపూడి మండలం మిరియాల గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో కారంపూడిలో పనిచేసిన కాశీవిశ్వనాధం ఇక్కడ నుండి బదిలీ అవ్వటంతో ప్రస్తుతం కారంపూడి ఇంచార్జి పాలనలో కొనసాగుతుంది. గత కొంతకాలంగా కాసిన్యనాయక్ ఇంచార్జిగా వ్యవహారిస్తున్నారు. సాధారణ బదిలీలలో భాగంగా మిరియాల నుండి కారంపూడి పంచాయతీ పూర్తికాలపు కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేసారు.