కరీంనగర్ జిల్లా: డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రం గన్నేరువరంలో పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు సత్యనారాయణ కి గజమాలతో సత్కరించారు, పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి సీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మానకొండూర్ నియోజవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కొలుపుల రవీందర్, మార్గం మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్,నాయకులు తిప్పర్తి పరిపూర్ణ చారి, ఏ. కర్ణాకర్ రెడ్డి,వేదేరే విజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
