మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ RDO కార్యాలయంలో శుక్రవారం RDO జయ చంద్రా రెడ్డి అధ్యక్షతన రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (RIs), సీనియర్ అసిస్టెంట్లు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా RDO జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ భూ భారతి సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే డిస్పోజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజులకంటే ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
అలాగే సాదా బైనామా, NFBS, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులు సహా ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో తూప్రాన్ డివిజన్ పరిధిలోని అన్ని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు.










