కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా / కాగజ్ నగర్ :కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ విస్తరణ సమావేశంలో భాగంగా నేడు కాగజ్ నగర్ పట్టణకేంద్రంలో ఉమ్మడి ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో జరిగిన సిర్పూర్ నియోజక వర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల జిల్లా సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆసిఫాబాద్ జిల్లా అబ్జర్వర్ రియాజ్ మరియు డిసిసి అధ్యక్షులు ఆత్రం సుగుణక్క , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నుండి జిల్లా కార్యవర్గంలో పదవులకు దరఖాస్తుల అభ్యర్థులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ పార్టీలో ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తింపు లభిస్తుందని. పార్టీలో చిన్న చూపు పెద్ద చూపు అనేది ఉండదని ఐక్య మద్దతుతోనే అందరం కలిసి ఒక తాటిపై నడిచి పార్టీ సంస్థాగతను అభివృద్ధి పరచాలని ఈ సందర్భంగా సూచించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.









