కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సందర్శించారు. ఆలయ చైర్మన్ లెండుగూరె జైరాం తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన సుగుణక్కను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్న స్వామివారి కల్యాణోత్సవం, జాతర ఏర్పాట్లను సుగుణక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ… ఈ ఆలయం ఎంతో పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధికంగా భక్తులు దర్శనానికి వచ్చే ఆలయాల్లో ఇది ఒకటి. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఆలయం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షుడు కిషన్ గౌడ్, RTA మెంబర్ లావుడ్య రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, ఇందిరా ఫెల్లోషిప్ జిల్లా కోఆర్డినేటర్ కోవ ఇందిరాబాయి, ఆలయ కమిటీ సభ్యులు విమల, దుప్పనాయక్,దుర్గం అన్నాజి, మాజీ సర్పంచ్ చిన్న సోమా శేఖర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం దేవాజీ, చిరంజీవి గౌడ్, మద్ధి సీను, మాజీ ఎంపీటీసీ మద్దెల సురేందర్ రాజు,దుర్గం రాజేష్, ఎర్రం తిరుపతి, ముంజం శ్యామ్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.









