కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత జర్నలిస్టులపై ఉందని డిపిఆర్ఓ సంపత్‌కుమార్ అన్నారు. శుక్రవారం డిపిఆర్ఓ కార్యాలయంలో విశాలాంధ్ర నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకొచ్చే కథనాలు ప్రచురించడంలో విశాలాంధ్ర స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జిల్లా ప్రజల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించేందుకు జర్నలిస్టులు ఎప్పుడూ ముందుంటారని, అదే జర్నలిజం విలువల లక్షణమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యూ.జె.హెచ్143 జిల్లా కన్వీనర్ రవి నాయక్, విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ ఈర్ల సతీష్‌కుమార్, టి.డబ్ల్యూ.జె.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వడ్నాల వెంకన్న, కాగజ్‌నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హైమద్ పాషా,
విశాలాంధ్ర రిపోర్టర్లు రమేష్, వెంకటేష్, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.










