కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణం లో యాదవ సంఘం భవనంలో ముంజం శ్రీనివాస్ అధ్యక్షతన సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాది ఆభీద్ హుసేన్ కు అభినందన సభ నిర్వహించారు . ఈ సందర్భంగా జరిగిన అభినందన సభ లో శ్రీ ఆబిద్ హుస్సేన్ మాట్లాడుతూ నేను న్యాయవాది వృత్తి చేపట్టకముందే సీఐటీయూలో పనిచేశాను కాబట్టి కార్మికుల పక్షాన నికరంగా నిలబడి పనిచేసేది సిఐటియు కాబట్టే, నేను కాగజ్ నగర్ నివాసిని కాబట్టే, ఇక్కడున్నటువంటి కార్మికులకు అన్యాయం జరగకూడదు వెంటనే ఎన్నికలు రావాలనే సదుద్దేశంతో ఎస్పీఎం యాజమాన్యం వేసినటువంటి కేసులో ఇంప్లీడై కౌంటర్ పిటిషన్ దాఖలాలు చేసినట్టు తెలిపారు. మనం సకాలంలో స్పందించకుంటే మిగతా కార్మిక సంఘాలకు కౌంటర్ పిటిషన్ దాఖలా చేసే అవకాశాలు ఉండేవి కావని మనం ముందుగా పిటిషన్ వేయడం వల్ల సమయం దొరికి మిగతా సంఘాలు కూడా తమ లాయర్లను పెట్టుకున్నారని, అందరూ ఎన్నికలు కావాలని కౌంటర్ పిటిషన్లు వేశారని అందుకు అనుగుణంగా తీర్పు కార్మికుల పక్షాన వచ్చిందని మేనేజ్మెంట్ వేసినటువంటి కేసు డిస్మిస్ అయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్. జనరల్ సెక్రెటరీ కుశన రాజన్న. సహాయ కార్యదర్శి అంగల. శ్రీనివాస్.కోశాధికారి నీలి రాజన్న.గడమల్ల మహేష్. మొగిలి వెంకటేష్.బూర సదయ్య. తదితరులు పాల్గొన్నారు.










