కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ మాట్లాడుతూ కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నడుస్తున్నాయని. కాగజ్ నగర్ పట్టణానికి నూతన శాఖ గ్రంథాలయ భవనానికి ఎంపీ ల్యాండ్ నిధుల నుండి రూ.50లక్షల అంచనాతో మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణంలో డ్రైనేజీ, రహదారులు మరియు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అనంతరం భారతీయ జనతా పార్టీ కర పత్రాలను మరియు డోర్ పోస్టర్ లను విడుదల చేసి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను పరిచయం చేశారు..








