కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్‌నగర్‌లో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ సమావేశం వంగరి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంసీఆర్హెచ్ఆర్డీ ట్రైనర్ అష్రఫ్, సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని సమాజంలోని రుగ్మతల నివారణకు, పారదర్శకత పెంపుకు వినియోగించాలని సూచించారు. కొంతమంది ప్రజా సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, చట్టబద్ధ గడువులో వివరాలు అందించాలని కోరారు. ఈ చట్టం సామాన్యుని వజ్రాయుధమని, ప్రభుత్వ పథకాల నిధుల వివరాలు తెలుసుకోవడానికి ఇది కీలకమని తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించారు. సమావేశంలో రామ్టైంకి కృష్ణ,కస్తూరి అఖిలేష్,రాజలింగు, కిరణ్, కిషోర్, రవిదాస్, శ్రీనివాస్, తిరుపతి, నాగేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.







