కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు మహిళలకు అధికారులు భారీ జరిమానా విధించారు.
జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన చంద్రగిరి సుజాత, సెగం పద్మ అనే మహిళలు అక్రమంగా దేశీ దారు అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై గతంలోనే బైండోవర్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తహశీల్దార్ ఎం. మధుకర్ ఇద్దరు మహిళలకు ఒక్కొక్కరికి రూ.60,000 చొప్పున జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ వి. రవి తెలిపారు.
ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.








