contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జిల్లాలో 14 పాఠశాలల్లో AI ఆధారిత విద్యాబోధన

కుమురం భీం ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విద్యాబోధన కొనసాగుతున్నదని, త్వరలో మరో నాలుగు పాఠశాలల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ తెలిపారు.

కాగజ్‌నగర్‌లోని ఫాతిమా కాన్వెంట్ హైస్కూల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణిత విషయాల్లో ప్రత్యేకంగా బోధన అందిస్తున్నామని తెలిపారు.

AI సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థి అభ్యాస వేగానికి అనుగుణంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ విధానాన్ని అమలు చేసిన తరువాత ముఖ్యంగా గణితంలో విద్యార్థులు గణనీయమైన పురోగతి సాధిస్తున్నారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వాసాల ప్రభాకర్‌తో పాటు రిసోర్స్ పర్సన్లు శివరాజ్, సంజయ్, మహేశ్వర్, జలపతిరావు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :