- జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
- జిల్లా వ్యాప్తంగా 38 కేంద్రాల్లో 6,948 మంది విద్యార్థుల హాజరు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో 6,948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని.సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వెలుతురు, విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని, తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులోఉన్నాయని .పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా జిల్లా స్థాయిలో 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, అలాగే ప్రతి కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు.విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు







