కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హరిత అన్నారు. సమీకృత భవన కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించి, జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఎస్.పి. నితికా పంత్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మత్, ఆసిఫాబాద్ ఆర్.డి.ఓ లోకేశ్వర్ రావు,తో తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణం సందీప్ నగర్ కు చెందిన బోయిని నగేష్ అనే మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజురికి చర్యలు తీసుకుంటామన్నారు. నాగేష్ సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి లావని పట్టా మంజూరి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. నగేష్ భార్యను మహిళా సంఘాల గ్రూపులో సభ్యురాలిగా చేర్పించి బ్యాంకు రుణం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని.పదవ తరగతి వరకు చదివి మానేసిన నగేష్ కూతురును, పై చదువులు చదివేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.









