కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో చీకట్లు తొలగిపోయాయి. అటవీ శాఖ ప్రత్యేక చర్యలతో ఇందిర్గం, రేచిని, గబ్బాయి, తలాయి వంటి గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి శ్రవణ్ కుమార్ పాల్గొని, “అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అటవీ శాఖ ఆధ్వర్యంలో సోలార్ దీపాలను ఏర్పాటు చేసాము. రాత్రి వేళల్లో వెలుతురు ఉండటం వల్ల ప్రజలకు రక్షణ, సౌకర్యం కల్పిస్తుంది” అని అన్నారు.
కార్యక్రమంలో శిక్షణ అధికారి సఫియా బేగం, బీట్ ఆఫీసర్ స్రవంతి, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తమ గ్రామాల్లో వెలుగులు నింపినందుకు గిరిజన ప్రజలు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.








