కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్‌లో ఎస్పీఎం జేకె పేపర్ మిల్లులో శుక్రవారం ఉదయం ఎస్సార్ ప్లాంట్‌లో కాస్టింకు పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శాశ్వత కార్మికుడు కాసిపేట రాజేందర్ కంటికి చేతికి గాయాలు కాగా, కాంట్రాక్ట్ కార్మికుడు మల్లయ్య రెండు కళ్ళకు చేతికి కాళ్లకు త్రివ గాయాలు అయ్యాయి. 2018లో మిల్లు పునఃప్రారంభమైనప్పటి నుండి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినా, మళ్లీ మళ్లీ ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. భద్రతా పరికరాలు అందించకపోవడం, సేఫ్టీ ప్రమాణాలను పాటించకపోవడమే ఈ పరిస్థితులకు కారణమని కార్మికులు విమర్శిస్తున్నారు. “లాభాల కోసం యాజమాన్యం పరుగులు పెడుతుంటే, ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం కార్మికులే. మాకు రక్షణ, న్యాయం ఎక్కడ?” అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సేఫ్టీ లేకపోవడం వల్ల మేమే ప్రాణాలు కోల్పోతున్నాం. యాజమాన్యంపై చర్య తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నారు” అని మండిపడుతున్నారు. మరణాలు జరిగినా, గాయాలు అయినా, యాజమాన్యం చూపు తిరగడం లేదని, సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడం, గాయపడిన వారికి సరైన వైద్యం అందించకపోవడం మాకు రోజువారీ వాస్తవం అయ్యిందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
