దహేగాం : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో అక్రమ పశువుల రవాణాపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం కీలక చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం లగ్గం ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించిన బృందం, బొలెరో వాహనం (TS 18 T 1439) లో 6 పశువులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకుంది.
పట్టుబడిన నిందితులు:
నవాబ్ ఖురేషి
మొహమ్మద్ రహ్మత్
షకీల్ ఖురేషి
ఫరీద్
వీరిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని దహేగాం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐపీఎస్ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ, జిల్లాలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు సహించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, ఎస్‌ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్స్ విజయ్, మధు, రమేష్, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ సాయి, తమ్షీర్ ఖాన్, రాజశేఖర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసులు ప్రజల సహకారంతో ఈ తరహా అక్రమ కార్యకలాపాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు